హిట్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్.. మెగా హీరోతో కొత్త సినిమాకు రంగం సిద్ధం?

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-21 05:30:05  IST  )

మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

హిట్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్.. మెగా హీరోతో కొత్త సినిమాకు రంగం సిద్ధం?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి తనదైన కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును రాబట్టుకున్నారు. ఇక ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హారోగా నటించిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో విమర్శలు వచ్చాయి. ఇక అప్పటినుంచి ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు మారుతి. ఈనేపథ్యంలో.. తాజాగా, మారుతికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘రాజాసాబ్’ పరాజయం తర్వాత మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పరిమిత బడ్జెట్‌లో వినోదాత్మక కథను తెరకెక్కించేందుకు మారుతి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, దాని తర్వాత ఆయన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘బరి’ చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మారుతి - వరుణ్ తేజ్ కాంబినేషన్ సినిమా అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ . మరి వీరిద్దరి కాంబో సెట్ అయి మారుతి మళ్లీ బాక్సాఫీస్ వద్ద పవర్ ఫుల్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.

లెనిన్ బంప‌ర్ హిట్..ఆ ద‌ర్శ‌కుడితో అఖిల్ కొత్త సినిమా ?

Next Story