- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ మోటరోలా ఫోన్ పై రూ.7500 డిస్కౌంట్..ధర, ఫీచర్స్ ఇవే
మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ పై రూ.7500 డిస్కౌంట్ లభించనుంది.

దిశ, వెబ్ డెస్క్: మోటరోలా కంపెనీకి సంబంధించిన మొబైల్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. సామాన్యులను టార్గెట్ చేసి, కొత్త ఫోన్లను తీసుకువస్తుంది కంపెనీ. ఈ నేపథ్యంలోనే ఇటీవల మోటరోలా ఎడ్జ్ 70 MAX మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్ ధర రూ.54, 999 వేలుగా ఫిక్స్ చేశారు. 8GB+256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది ఈ ఫోన్. 12GB RAM + 256GB వేరియంట్ కూడా ఉండనుంది. దీని ధర రూ.59,999గా ఉంది. ఇందులో ఆక్వా గ్రే, డార్క్ షాడో, ఐస్ మెల్ట్ మూడు రకాల మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.
అయితే ఈ మొబైల్ కొనుగోలు చేసే వాళ్లకు దాదాపు రూ.7500 డిస్కౌంట్ ఇస్తోంది కంపెనీ. యాక్సిస్, HDFC బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులు వినియోగించి ఈ మొబైల్ కొనుగోలు చేస్తే, రూ.5000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే దాదాపు రూ.2500 వరకు ఆదా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈఎంఐ ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.8 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్, 7100 mah బ్యాటరీతో వస్తోంది.






