- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో గొడవపడి... మనస్థాపంతో యువకుడి అదృశ్యం
ఇంట్లో బంధువులతో గొడవపడిన ఓ యువకుడు మనస్థాపం చెంది ఇంటి నుంచి బయటకు వెళ్ళి అదృశ్యమయ్యాడు.

దిశ, జవహర్ నగర్ : ఇంట్లో బంధువులతో గొడవపడిన ఓ యువకుడు మనస్థాపం చెంది ఇంటి నుంచి బయటకు వెళ్ళి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్ బాలాజీ నగర్ లో సత్యనారాయణ, భార్య, కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. చిన్న కుమారుడు సాయి కుమార్(25) కార్పెంటర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 21న ఇంట్లో బంధువులతో గొడవపడిన సాయి కుమార్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. అనంతరం తన అక్కకు సాయికుమార్ ఫోన్ చేసి 'నేను చనిపోవానుకుంటున్నా... నన్ను బంధువులు తిట్టడంతో మనస్థాపం చెందుతున్న' నా చావుకు బంధువులే కారణమంటూ ఫోన్ చేసి వెంటనే స్విచ్ఛాఫ్ చేశాడు. అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు తండ్రి సత్యనారాయణ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






