- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు కొడంగల్‌లో సీఎం రేవంత్ 'స్పెషల్ రివ్యూ'.. జిల్లా అధికారుల్లో టెన్షన్ !
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో, దీని పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

దిశ, కొడంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో, దీని పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జూలై 20వ తేదీ సాయంత్రం నాటికి అందిన అధికారిక గణాంకాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎం నేరుగా క్లాస్ తీసుకోనున్నారనే సమాచారంతో వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో తీవ్ర గుబులు మొదలైంది.
అధికారిక లెక్క తేలింది : డిజిటైజేషన్‌లో వికారాబాద్ ఎక్కడ ?
ప్రభుత్వ అధికారిక రిపోర్ట్ ప్రకారం వికారాబాద్ జిల్లాలోని ఓటరు సవరణ వివరాలు మొత్తం ఓటర్లు 10,17,671..
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 10,17,671 (100% పూర్తి)
డిజిటైజ్ అయిన ఫారాలు 7,30,399 (71.77% మాత్రమే)
జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల (EFs) పంపిణీ 100 శాతం పూర్తయినప్పటికీ, వాటిని ఆన్‌లైన్ సిస్టమ్‌లో డిజిటైజేషన్ చేసే ప్రక్రియ 71.77 శాతానికే పరిమితం కావడం పై సీఎం రేవంత్ రెడ్డి రేపటి సమీక్షలో తీవ్రంగా ప్రశ్నించే అవకాశం ఉంది.
కొడంగల్ వేదికగా సీఎంవో 'సర్జికల్ సీక్రెట్ రిపోర్ట్' !
ఓటరు సర్వే ప్రక్రియ కేవలం రొటీన్ ఆఫీస్ పని కాదని, రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు, నాయకుల పనితీరుకు ఇది 'రిపోర్ట్ కార్డ్' గా మారుతుందని సీఎం ముందే హెచ్చరించారు.
ASD ఓట్ల తీరుపై ఆరా : వలస వెళ్లిన పేదల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా 'అబ్సెంట్/షిఫ్టెడ్' (ASD) కింద తొలగించారా లేదా? అనే దానిపై ఇంటెలిజెన్స్ సమాచారంతో సీఎం సిద్ధమయ్యారు.
BLAల సమన్వయం : ప్రతిపోలింగ్ బూత్‌లో బీఎల్ఓ (BLO)లతో పాటు పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంతవరకు సమన్వయం చేసుకున్నారనే దానిపై స్పష్టత తీసుకోనున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే పదవుల ఊడతీత ఖాయం !
కొడంగల్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్, పరిగి, తాండూర్ పరిధిలో కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత ఓట్ల నమోదు మరియు ఫారాల డిజిటైజేషన్ ఆలస్యం పై సీఎం సూటిగా బాధ్యులను నిలదీయనున్నారు. కాగితాల పై గణాంకాలు చూపి తప్పించుకుందామనుకుంటే కుదరదని, క్షేత్రస్థాయిలో లోపాలు కనిపిస్తే అధికారులతో పాటు పార్టీ ఇన్ఛార్జుల పై చర్యలు తప్పవని సమాచారం.






