- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెనిన్ బంపర్ హిట్..ఆ దర్శకుడితో అఖిల్ కొత్త సినిమా ?
డైరెక్టర్ అనిల్ రావిపూడితో మూవీ చేసేందుకు అఖిల్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ లేటెస్ట్ గా నటించిన సినిమా లెనిన్. మొన్న జులై 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. గడిచిన 10 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ 100 కోట్లకు చేరుకున్నాయి. ఈ మూవీలో అఖిల్ హీరోగా చేయగా.. భాగ్యశ్రీ హీరోయిన్ గా మెరిశారు. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో.. వచ్చిన ఈ మూవీ, ఓ విలేజ్ రివేంజ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ మూవీలో అఖిల్ గుడ్డివాడి పాత్రలో మెరుస్తారు. ఇదే సినిమాకు హైలెట్ గా నిలిచింది.
గతంలో అఖిల్ చేసిన సినిమాల్లో రియాలిటీ కనిపించలేదు కానీ... లెనిన్ మాత్రం మాస్ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించింది. దీంతో సినిమా బంపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట లెనిన్. ఇందులో భాగంగానే ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మూవీ చేసేందుకు అఖిల్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు కథ కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు. అక్కినేని నాగార్జుననే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.






