- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతపల్లిలో అక్రమ రియల్ వ్యాపారం?
నా వ్యాపారం నాది.. ప్రభుత్వ అనుమతులతో నాకేం పని.. అంటూ రియల్ వ్యాపారులు తమ దందాను కొనసాగిస్తున్నారు.

దిశ, నల్లగొండ బ్యూరో/చింతపల్లి: నా వ్యాపారం నాది.. ప్రభుత్వ అనుమతులతో నాకేం పని.. అంటూ రియల్ వ్యాపారులు తమ దందాను కొనసాగిస్తున్నారు. డీటీసీపీ, రేరా అనుమతులు లేకున్నా గజాలలో ధన చెప్పి గుంటల్లో(121గజాలు) భూ అమ్మకాలు చేస్తున్నారు. హైదరాబాద్ నాగార్జునసాగర్ జాతీయ రహదారికి మధ్యలో చింతపల్లి మండల కేంద్రంలో సాన్విక థీమ్ ఫామ్స్ సారధ్యంలో అక్రమ ఫామ్ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు. గుంటలు గుంటలుగా చింతపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరుపై ప్రత్యేక కథనం. నాగార్జునసాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై చింతపల్లి మండల కేంద్రంలో "సాన్విక థీమ్ ఫామ్స్" వెంచర్ పేరుతో సర్వే నెంబర్ 476/p, 483/p,484/p ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ వెంచర్ ఏర్పాటు చేశారు.
వెంచర్లు చేయాలంటే నిబంధనలు ఇవి..
భూమి వ్యవసాయ భూమి అయితే, దానిని నాన్-అగ్రికల్చర్ ఉపయోగం కోసం మార్చడానికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుండి అనుమతి తీసుకోవాలి. లే అవుట్ ప్లాన్‌ను స్థానిక అధికారులు లేదా డెవలప్‌మెంట్ అథారిటీ HMDA, DTCP, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదించాలి. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (DTCP) లేదా స్థానిక పంచాయతీ అధికారుల నుండి అనుమతి అవసరం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA),లే అవుట్ ప్లాన్‌లో రోడ్లు, ఓపెన్ స్పేస్‌లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి సౌకర్యాలకు సంబంధించిన నిబంధనలు పాటించాలి. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్, 2016 ప్రకారం, 500 చదరపు మీటర్లు లేదా 8 ప్లాట్‌లకు మించిన లే అవుట్ ప్రాజెక్ట్‌లు రాష్ట్ర RERA పోర్టల్‌లో నమోదు చేయాలి.
RERA నమోదు కస్టమర్లకు పారదర్శకతను నిర్ధారిస్తుంది. చట్టపరమైన రక్షణను అందిస్తుంది. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్, భూమి పర్యావరణ సున్నితమైన ప్రాంతంలో ఉంటే ( నీటి వనరులు, అడవుల దగ్గర), స్టేట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ (SEIAA) నుండి అనుమతి ఉండాలి. లే అవుట్‌లో భవన నిర్మాణాలు ఉంటే, ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ నుండి NOC తీసుకోవాలి.స్థానిక పంచాయతీ/మున్సిపల్ అనుమతులు, స్థానిక గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ అధికారుల నుంచి లే అవుట్ అనుమతి తీసుకోవాలి, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాల కోసం కొన్ని సందర్భాల్లో, భూమి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే, పంచాయతీ నుంచి అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిర్దిష్ట గవర్నమెంట్ ఆర్డర్‌లు (GOs) లేదా రెగ్యులేషన్‌లకు అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు, అనుమతి లేని లే అవుట్‌లలో ప్లాట్లు కొనడం వల్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడవచ్చు. RERA పోర్టల్‌లో వెంచర్ నమోదైందా? నిర్ధారించుకోవాలి. ఇవన్నీ పాటించకుండానే కోట్ల రూపాయల కొల్లగొట్టి ప్రజలను మోసం చేస్తున్న వెంచర్లపై రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అందమైన బ్రోచర్లతో వల..
అందమైన బ్రోచర్లు ఆకర్షణీయంగా ముద్రించి, సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం చేసి కస్టమర్లను వలలో వేసుకుంటారు. హైదరాబాదుకు అతి సమీపంలో ఉండటం వల్ల ప్రభుత్వ సెలవు దినాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఉద్యోగులు, ఐటీ రంగంలో పనిచేసే ఎంప్లాయిస్ ను రియల్ వ్యాపారులు టార్గెట్ గా చేసి ప్లాట్లు కొనుగోలు చేసేలా మాయమాటలు చెప్పి బుజ్జగిస్తారు. సెలవు దినాలలో వెంచర్‌కి తీసుకువచ్చి విందులు ఏర్పాటు చేసి ప్లాట్లు కొనుగోలు చేసేలా బుట్టలో వేసుకుంటారు. వాళ్లనే కాకుండా వాళ్లతో పాటు పనిచేసే ఉద్యోగులను కూడా తమ వైపుకు తిప్పుకునేలా ఆఫర్లు ప్రకటించి ప్లాట్లు కొనుగోలు చేసేలా మచ్చిక చేసుకుంటారు. మాయమాటలకు మోసపోయిన చాలామంది ఉద్యోగస్తులు ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్న విషయం బహిరంగ రహస్యమే. అలా మోసపోయిన చాలామంది బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు.






