- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంటనే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.. భారీ వర్షంలో నిరసన
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యూజే హెచ్ 143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం 'చలో కలెక్టరేట్' కార్యక్రమం నిర్వహించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యూజే హెచ్ 143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం 'చలో కలెక్టరేట్' కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామల గట్టు నాయకత్వంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ, అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు తమ హక్కుల కోసం..
అక్రిడిటేషన్ కార్డులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయాణ సౌకర్యాలు, అధికారిక గుర్తింపు వంటి ప్రయోజనాలకు జర్నలిస్టులు దూరమవుతున్నారన్నారు. ఆరు నెలల్లో బస్సు పాస్‌ను ఆరుసార్లు రెన్యువల్ చేయించుకోవాల్సిన పరిస్థితి జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు తమ హక్కుల కోసం భారీ వర్షంలోనూ రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు వినతి పత్రం అందజేశారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






