- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో వైభవంగా లాల్ దర్వాజా బోనాలు.. పాల్గొన్న కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బోనాలు, జానపద కళారూపాలు, పోతురాజుల విన్యాసాలతో తెలంగాణ భవన్ ప్రాంగణం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీమహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ.జితేందర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయల్, సింహవాహిని శ్రీమహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏ.పీ.జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు బోనాల ఉత్సవాలు తమ మాతృభూమి సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశ రాజధానిలోనూ అదే వైభవంతో నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.






