ఉద్యమకారుల కోసమే బీఆర్ఎస్‌లో బలయ్యాను: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

by Ajay Maddhiboyina |

తాను ఉద్యమకారుల కోసం బీఆర్ఎస్‌లో అంతర్గతంగా పోరాటం చేసి బలైన వ్యక్తిని అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి కవిత నివేదిక అందజేశారు.

ఉద్యమకారుల కోసమే బీఆర్ఎస్‌లో బలయ్యాను: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను ఉద్యమకారుల కోసం బీఆర్ఎస్‌లో అంతర్గతంగా పోరాటం చేసి బలైన వ్యక్తిని అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి కవిత నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించటం, గౌరవించటం కోసం కమిటీ ఏర్పాటు చేయటం సంతోషమని.. ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో ఆలస్యం చేయవద్దని.. కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉన్నదని.. అది తప్పని నిరూపించాలని కోరారు. స్వతంత్రత సైనిక్ సమ్మాన్, హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ రూల్ పొజిషన్‌ను కమిటీ స్టడీ చేయాలని.. వాటిలో ఉన్న విధంగా ఉద్యమకారులకు ప్రయోజనం కలిగించాలని డిమాండ్ చేశారు.

ఉద్యమంలో ఉద్యమకారులతో భుజం భుజం కలిపి పోరాటం చేశానని.. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటూ అంతర్గత వేదికల్లో చెప్పి వారి కోసం పోరాటం చేశానని చెప్పారు. తాను చెప్పే రెండు మాటలతో ఉద్యమకారులకు మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్లు భావిస్తానని చెప్పారు. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, యూపీ, మహారాష్ట్రల్లో ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తున్నారని.. జార్ఖండ్ లో మాదిరిగా గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యమకారులను గౌరవించాలన్నారు.

Next Story