లింగోటంలో పోలీసుల దాడి.. 6 క్వింటాళ్ల నిషేధిత నల్ల బెల్లం స్వాధీనం

by Taduka Kalyani |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని

లింగోటంలో పోలీసుల దాడి.. 6 క్వింటాళ్ల నిషేధిత నల్ల బెల్లం స్వాధీనం
X

దిశ, అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగోటం గ్రామంలో నిషేధిత నల్ల బెల్లం అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో మంగళవారం అచ్చంపేట ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గాలి ముడి సుజాత ఇంట్లో మొత్తం 20 బ్యాగుల నల్ల బెల్లం లభ్యమైంది. ఒక్కో బ్యాగులో 30 కిలోల చొప్పున ఉండగా, మొత్తం 6 క్వింటాళ్ల (600 కిలోల) నిషేధిత నల్ల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ నల్ల బెల్లాన్ని నిన్న రాత్రి లింగోటం తండా కు చెందిన కాట్రావత్ పవన్ కుమార్ తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వం నిషేధించిన నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలించి నిల్వ చేసినందుకు కాట్రావత్ పవన్ కుమార్, గాలి ముడి సుజాతపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట ఎస్సై నరేష్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అందించే సమాచారం పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై నరేష్ హెచ్చరించారు.

Next Story