- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
16 ఆస్తి నేరాల కేసులున్న అంతర్రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7 న మూడావత్ రవి రాత్రి తన ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా,

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7 న మూడావత్ రవి రాత్రి తన ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ తెలిపారు. ప్రత్యేక బృందాలతో తాము సీసీ టీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం నిందితుడు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో తిరుగుతున్నట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా, అతని పేరు బోయిని శ్రీకాంత్(24), కమలాపూర్ గ్రామం, యాదవ మండలం, రంగారెడ్డి జిల్లా వాసిగా గుర్తించినట్లు తెలిపారు.
విచారణలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆటో చోరీ కేసులో తానే నిందితుడునని అంగీకరించాడని, నిందితుడు తెలిపిన వివరాల మేరకు.. చోరీకి గురైన ఒక ఆటో రిక్షా ను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, దర్యాప్తులో భాగంగా నిందితుడి నేర చరిత్రను పరిశీలించగా, అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 16 ఆస్తి నేరాల కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని సీఐ తెలిపారు. నిందితుడు వివిధ ప్రాంతాల్లో వాహనాల యజమానులు నిర్లక్ష్యంగా పార్క్ చేసిన ఆటోలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, అతనిపై మరిన్ని కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు సీఐ ఇజాజోద్దీన్ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన, టూ టౌన్ ఎస్సై శివనాగేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, పీసీలు అశోక్, కురుమూర్తి, ఐటీ కోర్ సిబ్బంది ప్రవీణ్ లను జిల్లా ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు.






