- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్నించే గొంతులను అణచలేరు: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త ఖండించారు.

దిశ, చైతన్యపురి: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త ఒక ప్రకటనలో ఖండించారు. విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్షాన్ని పోలీసు బలంతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఈ అంశంపై బాధ్యతాయుతంగా స్పందించి దేశ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును హరించడం రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమేనన్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






