భార‌త న‌టితో RCB క్రికెట‌ర్ పెళ్లి...?

by velandi.Saikiran |

భారత నటితో డేటింగ్ వార్తలపై బెథెల్ క్లారిటీ ఇచ్చారు.

భార‌త న‌టితో RCB క్రికెట‌ర్ పెళ్లి...?
X

దిశ‌, వెబ్ డెస్క్: RCB ప్లేయర్ జాకబ్ బెథెల్ భారత నటి ఆద్య ఆనంద్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 ప్రారంభంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. అది కాస్త ప్రేమగా మారిందని జోరుగా ప్రచారం సాగింది. మ్యాక్సీ మామ తరహాలోనే ఇండియాకు సంబంధించిన ఆద్య ఆనంద్ ను బెథెల్ పెళ్లి చేసుకుంటాడని కూడా తెగ పోస్టులు పెట్టారు. అయితే ఈ వార్తలను తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ జాకబ్ బెథెల్ కొట్టి పారేశారు.

ఐపీఎల్ యాడ్ షూట్ లో మాత్రమే తాము పాల్గొన్నామని , అంతేకానీ తమ మధ్య ఇలాంటి సంబంధం లేదన్నారు. యాడ్ షూట్ లో భాగంగా కలిసి ఓ ఫోటో దిగామని.. అప్పటినుంచి స్నేహితులుగా మారినట్లు వివరించారు. ఆ తర్వాత ఎప్పుడు కలవలేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. తమ మధ్య రిలేషన్ షిప్ రూమర్లు వచ్చినప్పుడు నమ్ముకుంటానని తెలిపారు. ఇది ఇలా ఉండ‌గా, ఆద్య ఆనంద్ హిందీలో కృష్డ్, బాంబే బేగమ్స్, నాక్ నాక్ కౌన్ హే లాంటి వెబ్ సిరీస్ లలో నటించారు. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వస్తే చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఆమె ఓ మోడల్ గా కూడా పనిచేస్తున్నారు.

Next Story