మంగళగిరి సీకే కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత

by Ajay Maddhiboyina |

మంగళగిరి సీకే కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి నారాలోకేష్ కార్యక్రమాన్ని అడ్డుకునేందకు కొందరు దళిత పారిశ్రామికవేత్తలు ప్రయత్నించారు.

మంగళగిరి సీకే కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి సీకే కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి నారాలోకేష్ కార్యక్రమాన్ని అడ్డుకునేందకు కొందరు దళిత పారిశ్రామికవేత్తలు ప్రయత్నించారు. పారిశ్రామిక‌వేత్త‌ల ఆందోళ‌న‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌హిళ‌పై చేయి చేసుకున్నారంటూ మంగ‌ళ‌గిరి రూర‌ల్ సీఐ వెంక‌ట్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. యూనిఫామ్‌లో ఉంటే ఆడ‌వాళ్ల‌పై చేయి చేసుకుంటారా అంటూ మహిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన‌డంతో నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి దుస్తులు పూర్తిగా చిరిపోయాయి. అతడు రోడ్డుపై కూర్చుని ప‌ట్టుబ‌ట్ట‌డంతో పోలీసులు అత‌డిని బ‌ల‌వంతంగా ప‌ట్టుకుని జీప్ ఎక్కించారు.

Next Story