- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలీవుడ్‌ను చూసి నేర్చుకోండి.. టాలీవుడ్ దర్శకనిర్మాతలపై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్
ఇప్పుడు ఎందుకు అలా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం? సినిమా బాగుండాలన్నా, అందరూ ప్రశాంతంగా పనిచేయాలన్నా రిలీజ్‌కు కనీసం రెండు వారాల ముందే పనులన్నీ పూర్తి చేసి ఫైనల్ కాపీ రెడీగా ఉంచాలి

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన యాక్షన్ మూవీ ‘లెనిన్’. మురళి కిషోరు అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచి బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌ను దక్కించుకుంటోంది. మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. ఏజెంట్’ పరాజయం తర్వాత అఖిల్‌కు ఈ రేంజ్ హిట్ రావడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నాగార్జున పాల్గొని టాలీవుడ్ చిత్రాల విడుదల తేదీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ చిత్రం ‘ఒడిస్సీ’ ఏడాది ముందే డేట్ ప్రకటించి సరిగ్గా అదే తేదీకి వచ్చిందని, కానీ మన దగ్గర రిలీజ్ డేట్స్ ఇచ్చినా సమయానికి సినిమాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘లెనిన్’ విషయంలోనూ ఇదే జరిగిందని, తాను జూన్ 26న విడుదల తేదీ ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’ చిత్రాల కాపీలను నెల రోజుల ముందే చూసేవాళ్లమని, ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. ఒకప్పుడు తన ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’ సినిమాల టైమ్‌లో.. రిలీజ్‌కు నెల రోజుల ముందే పూర్తి సినిమా రెడీగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. "ఇప్పుడు ఎందుకు అలా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం? సినిమా బాగుండాలన్నా, అందరూ ప్రశాంతంగా పనిచేయాలన్నా రిలీజ్‌కు కనీసం రెండు వారాల ముందే పనులన్నీ పూర్తి చేసి ఫైనల్ కాపీ రెడీగా ఉంచాలి" అని నాగార్జున కోరారు. ఇది కేవలం వేరే వాళ్ల కోసం మాత్రమే కాదని, తనతో సహా ఇండస్ట్రీలోని దర్శకులు, నిర్మాతలు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయమని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.






