- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NDA పార్లమెంటరీ పార్టీ భేటీ.. ‘నీట్’ వివాదంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ
NDA పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) పాల్గొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని, వారికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం త్వరితగతిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడటం తీవ్రమైన నేరమని పేర్కొన్న ప్రధాని, విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకున్న తప్పు చేసిన వాళ్లను చట్టపరంగా శిక్షించేందుకు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈ కేసులో దోషులకు దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల ద్వారా కఠినమైన శిక్ష పడేలా చేస్తామని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో పరీక్షా పత్రాలు లీక్ కాకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించడం మనందరి జాతీయ బాధ్యత అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.






