‘RC-17’ లో హీరోయిన్ ఫిక్స్.. రామ్ చరణ్‌కు జోడీగా నేషనల్ క్రష్!

by Mallepaka Hamsa |

ఇందులో రామ్ చరణ్‌ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

‘RC-17’ లో హీరోయిన్ ఫిక్స్.. రామ్ చరణ్‌కు జోడీగా నేషనల్ క్రష్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి తన 17వ చిత్రం (RC17) చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే రావడంతో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుందని, అతిత్వరలోనే షూటింగ్ కూడా పట్టాలెక్కనుందని సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించిన వార్తలు వరుసగా హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

ఇందులో రామ్ చరణ్‌ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీతో రష్మికకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, పాపులారిటీ దక్కాయి. అంతేకాకుండా రష్మికకున్న పాన్-ఇండియా గుర్తింపు, ఆమె నటన ఈ కథలోని హీరోయిన్ క్యారెక్టర్‌కు పక్కాగా సెట్ అవుతాయని సుకుమార్ భావిస్తున్నారట. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, ప్రాధాన్యత ఉన్నదిగా ఉండబోతోందని టాక్. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక కూడా తోడైతే ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story