"జూలై 20ని ‘కిరాతక దినం’గా ప్రకటించాలని విపక్ష ఎంపీల డిమాండ్

by Malleboina Mahesh |

జూలై 20ని 'కిరాతక దినం'గా ప్రకటించాలి.. ఢిల్లీ నిరసనకారులపై పోలీసుల దాడిపై మండిపడ్డ విపక్ష ఎంపీలు సంజయ్ రౌత్, మహువా మోయిత్రా!

జూలై 20ని ‘కిరాతక దినం’గా ప్రకటించాలని విపక్ష ఎంపీల డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సీజేపీ తలపెట్టిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తలకు దారీ తీసి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నిరసన కారులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులపై పోలీసులు దాడిని ఖండిస్తూ.. "జూలై 20ని ‘కిరాతక దినం గా ప్రకటించాలని విపక్ష ఎంపీల డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జి, అరెస్టుల దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, కాంగ్రెస్ నేత పవన్ ఖేరాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులను పోలీసులు క్రూరంగా ఈడ్చుకెళ్లిన జూలై 20వ తేదీని 'కిరాతక దినం' (Coward Day) గా ప్రకటించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేయగా, "ఇదిగో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం" అంటూ మహువా మోయిత్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లీకేజీ వల్ల ప్రాణాలు కోల్పోయిన నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల్లో 118 మంది పోలీసులు, 60 మంది ఆందోళనకారులు గాయపడ్డారని చెబుతూ ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. పాలకుల ఆదేశాలతో యువతపై లాఠీలు ఝళిపించిన వారు రేపు రాజ్యాంగం ఇచ్చే శిక్షను ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా హెచ్చరించగా, మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆపేదే లేదని సీజేపీ స్పష్టం చేసింది.

Next Story