- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎరుగురవేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.

దిశ, చైతన్యపురి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందేలా చూస్తూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎరుగురవేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నూతనంగా నియమింమపబడిన మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బొడిగె స్వామిగౌడ్, లెక్చరర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షులు కళ్లెం నర్సింహారెడ్డిలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. తమ నియామకానికి సహకరించినందుకు పిసిసి అధ్యక్షలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ,ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీగౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి జక్కిడి ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్బినగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని అత్యధిక కార్పొరేటర్ స్థానాలను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రెడ్డి, నగేష్, ఎర్ర మహేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు జక్కిడి సత్యతేజరెడ్డి, నర్సింహారావు, సుక్క వెంకటేష్, విట్టల్ రెడ్డి, యాదగిరి, కృష్ణగౌడ్, రాము, రఘుపతి, లింగంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.






