- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ, అమిత్ షా రాజీనామా చేయాలి.. రాహుల్ ధర్నాకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
ఢిల్లీ ఆందోళనలు, నీట్ లీకేజీపై ప్రధాని మోడీ, అమిత్ షా రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ ఆందోళనలు, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు మెరుపు ధర్నాకు దిగడంపై ఇవాళ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ పోస్టు చేసిన ఆయన.. యువతపై పోలీసులు చర్యలకు నిరసనగా భారత భవిష్యత్ ఆశాకిరణం రాహుల్ గాంధీ నిరసన చేపట్టారని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న యువతకు ధైర్యం చెబుతూ, వారికి సంపూర్ణ మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హస్తం యువతకు తోడుగా ఉందని రాసుకొచ్చారు.
రాహుల్ గాంధీ వర్సెస్ సెంట్రల్:
ఇదిలా ఉంటే మోడీ నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నా చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే కేంద్ర మంత్రి జిదేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చించగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి ముందు కీలక డిమాండ్లు ఉంచింది. ఆ డిమాండ్లపై అమిత్ షాతో చర్చించిన జిదేంద్ర సింగ్ మరోసారి రాహుల్ గాంధీతో చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో జాతీయ రాజకీయం ఒక్కసారిగా రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారిపోయింది.






