- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచాలలో రక్షించిన నెమలికి వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స
గ్రామ సమీపంలో కుక్కల దాడికి గురైన ఓ నెమలిని స్థానికులు సమయస్ఫూర్తితో రక్షించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన మంచాలలో మంగళవారం చోటుచేసుకుంది.

దిశ, మంచాల : గ్రామ సమీపంలో కుక్కల దాడికి గురైన ఓ నెమలిని స్థానికులు సమయస్ఫూర్తితో రక్షించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన మంచాలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచాల నుంచి జపాలకు వెళ్లే రహదారిలోని ఆవ యాదయ్య పొలం వద్ద ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ నెమలి పై కుక్కలు దాడి చేయడానికి యత్నించాయి. గమనించిన స్థానికులు అశ్వాల బాల్‌రాజ్, ఆవ వెంకటేష్, మలగ లింగం, జలముని, రమేష్ వెంటనే స్పందించి నెమలిని రక్షించి సురక్షితంగా పట్టుకున్నారు.
వెంటనే మంచాల సీఐ మధుకు సమాచారం అందించగా, ఆయన అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ నంబర్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు బీట్ ఆఫీసర్ చంద్రశేఖర్‌కు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానికులు నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం నెమలిని స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. వైద్యురాలు కాత్యాయిని, సిబ్బంది శ్రీశైలంతో కలిసి గాయపడిన నెమలికి ప్రథమ చికిత్స అందించి ఇంజెక్షన్లు ఇచ్చారు. చికిత్స అనంతరం మెరుగైన సంరక్షణ కోసం నెమలిని ఆగపల్లిలోని అటవీ శాఖ నర్సరీకి తరలించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.






