- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బియ్యం మట్టి పాలు.. పాడవటంతో పూడ్చివేత
by Batti.Sumithra |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షల రూపాయల విలువ చేసే బియ్యం మట్టి మట్టిపాలయ్యాయి.

X
దిశ, వాంకిడి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షల రూపాయల విలువ చేసే బియ్యం మట్టి మట్టిపాలయ్యాయి. గత ఏడాది వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి సుమారు 60 మందికి పైగా పిల్లలు అస్తవ్యస్తకు గురి కాక.. అందులో ఓ విద్యార్థిని మృతి చెందింది. విచారణ నేపథ్యంలో అధికారులు అప్పుడు హాస్టల్ లో నిల్వ ఉన్న బియ్యంతో పాటు రెండు నూనె కాటన్లను సీజ్ చేశారు. వాటిని వినియోగించకుండా అలానే నిల్వ ఉంచడం వల్ల సుమారు 90 క్వింటాళ్ల బియ్యం పురుగులు. బూజు పట్టి పూర్తిగా పాడైపోయాయి. దీంతో రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి మంగళవారం డంపింగ్ యార్డులో పూడ్చి పెట్టారు.
Next Story






