అక్రమ ఇసుక నిషిద్ధ పదార్థాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

by Taduka Kalyani |

మండల పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక, ఇతర నిషేధిత పదార్థాల రవాణా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, అక్రమంగా రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్సై పోచంపల్లి సతీష్ అన్నారు.

అక్రమ ఇసుక నిషిద్ధ పదార్థాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
X

దిశ, చిట్యాల: మండల పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక, ఇతర నిషేధిత పదార్థాల రవాణా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, అక్రమంగా రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్సై పోచంపల్లి సతీష్ అన్నారు. మానేరు వాగు నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న, నేరేడుపల్లి గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్లను మంగళవారం స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. మానేరు వాగు నుంచి జడల్ పేట వైపు, అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోవడం, సరైన ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోవడం,డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ 5 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసి చట్టరీత్యా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇకముందు వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లు, ఇన్సూరెన్స్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు.

Next Story