- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ మోతీనగర్ లో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించండి
మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ మోతీనగర్, సద్దులగుండు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ను కోరారు.

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ మోతీనగర్, సద్దులగుండు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ను కోరారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే నిలయం లోని జీఎం కార్యాలయంలో ఆయన జీఎంను కలిసి మాట్లాడారు. న్యూ మోతీనగర్ లో 10 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, అక్కడి నుంచి సద్దులగుండు, రాజేంద్రనగర్, ప్రేమ్‌నగర్ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇప్పటికీ రైల్వే ట్రాక్ దాటాల్సిన ప్రమాద పరిస్థితి ఉందని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ల రాకపోకలు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాయని వివరించారు. అత్యవసరంగా అక్కడ నూతన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అదేవిధంగా న్యూ మోతీనగర్ నుంచి ఎఫ్.సి.ఐ గోదాం వరకు శాశ్వత రహదారి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ గౌడ్ వినతి పై సానుకూలంగా స్పందించిన జిఎం సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మధుమోహన్, లక్ష్మీ నరేష్, మాజీ కౌన్సిలర్ గంజి వెంకన్న, గోనెల రాములు, పడాల శేఖర్, గోపి, రవికుమార్, సిద్ధు, తదితరులు ఉన్నారు.






