గ్రామ అభివృద్ధికి రూ.70 లక్షలు మంజూరు

by Batti.Sumithra |

మండల పరిధిలోని పోచారం గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేష్, ఉపసర్పంచ్ మైలారం కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామ అభివృద్ధికి రూ.70 లక్షలు మంజూరు
X

దిశ, ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని పోచారం గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేష్, ఉపసర్పంచ్ మైలారం కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం గ్రామ అభివృద్ధి పనుల కోసం రూ.70 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తూ, గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోచారం గ్రామానికి రూ.70 లక్షలు మంజూరు చేసినందుకు గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేష్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీశైలం యాదవ్ (రామారావు), గ్రామ శాఖ అధ్యక్షుడు చింతాకుల శివ గౌడ్, వార్డు సభ్యుడు తాళ్లపల్లి సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాయి మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story