64 లక్షల మందికి తల్లులకు తీపికబురు.. రేపటి నుంచే ఖాతాల్లోకి రూ.13 వేలు

by Kema Shiva Kumar |

రేపటి నుంచే 64 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ పథకం కింద నగదు జమ కానుంది.

64 లక్షల మందికి తల్లులకు తీపికబురు.. రేపటి నుంచే ఖాతాల్లోకి రూ.13 వేలు
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం మరోసారి విద్యార్థుల తల్లులకు తీపి కబురు అందించింది. తాజాగా తల్లికి వందనం పథకం (Thalliki Vandanam Scheme) కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపటి నుంచి నగదు జమ కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో రూ.13 వేల ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. అయితే, అకౌంట్లలో నగదు జమ అయ్యే సమయంలో లబ్ధిదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఐడీ, పోలీసు అధికారులు ప్రజలను హెచ్చరించారు.

ఫేక్ ఆన్‌లైన్ లింకులతో ప్రమాదం..

‘తల్లికి వందనం నగదు స్టేటస్ చెక్ చేసుకోండి’, ‘మీ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయండి’ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లలో వచ్చే నకిలీ లింకులను (Fake Links) ఎవరూ తొందరపడి క్లిక్ చేయకూడదని పోలీసులు సూచించారు. అదేవిధంగా ఎవరైనా ఫోన్, మెసేజ్ చేస్తే.. లబ్ధిదారులు ఎవరూ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏటీఎం పిన్, ఆధార్ నంబర్, సీవీవీ, మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ల వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ ప్రతినిధులు ఫోన్ చేసి ఎప్పుడూ ఓటీపీలు, పర్సనల్ ఇన్‌ఫర్మేషన్‌ను ఎన్నడూ అడగబోరనే విషయాన్ని గుర్తించాలన్నారు.

Next Story