- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యభర్తలు గొడవ... ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం
by Taduka Kalyani |
భార్య భర్తలు గొడవపడి మనస్థాపం చెందిన భార్య ఇద్దరు పిల్లలతో సహా ఇంటి నుంచి బయటకు వెళ్ళి అదృశ్యమైంది.

X
దిశ, జవహర్ నగర్ : భార్య భర్తలు గొడవపడి మనస్థాపం చెందిన భార్య ఇద్దరు పిల్లలతో సహా ఇంటి నుంచి బయటకు వెళ్ళి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... యాప్రాల్ జేజేనగర్ లో సుమంత్, భార్య శ్రావణి, 10 ఏళ్ళ లోపు ఇద్దరు కుమారులు అవినాష్, యశ్వంత్ తో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 16న భార్య భర్తలు గొడవపడి భర్త సుమంత్ తన సొంతూరు కి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో శ్రావణి(28) ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటుంది. 19న శ్రావణి చెల్లెలు అనూష అక్క వద్దకు వచ్చి చూడగా కనిపించలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు శ్రావణి చెల్లెలు అనూష జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






