- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటడం కన్నా పరిరక్షణకే ప్రాధాన్యత
మొక్కలు నాటడం కన్నా వాటి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ అన్నారు.

దిశ, రెబ్బెన : మొక్కలు నాటడం కన్నా వాటి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం గోలేటి సీహెచ్‌పీ వద్ద ఏరియా అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యమంలా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గనుల డంపుల పై మొక్కలు నాటి వాటిని సంరక్షించి సీఏ ల్యాండ్ కింద అటవీ శాఖకు అందించడం ద్వారా కొత్త గనులకు అనుమతులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. సీహెచ్‌పీ పరిసరాల్లో గతంలో మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా ఎదిగేలా సంరక్షించిన సిబ్బందిని జీఎం అభినందించారు.
మొక్కలు నాటడంతోనే బాధ్యత ముగియదని, వాటిని సంరక్షించి భావితరాలకు ఫలాలను, స్వచ్ఛమైన ప్రకృతిని అందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్. తిరుపతి, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి, ఎస్‌వోటు జీఎం కె.రాజమల్లు, గోలేటి ఓసీ పీవో ఎన్.ఉమాకాంత్, ఏరియా సేఫ్టీ అధికారి స్వామిరాజు, సీహెచ్‌పీ హెచ్‌ఓడీ కోటయ్య, డీజీఎం పర్సనల్ దేవరకొండ కిరణ్‌బాబు, ఎన్విరాన్‌మెంట్ అధికారి జైపాల్ జాదవ్, ఫారెస్ట్ అధికారిణి సుష్మ లక్ష్మి, పిట్ కార్యదర్శి రామయ్యతో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.






