- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో కేంద్రానికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుంది: కేటీఆర్
యువత చేతిలో ఢిల్లీలో కేంద్రానికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: యువత చేతిలో ఢిల్లీలో కేంద్రానికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతను మోసం చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణలోనూ తరిమికొడతారని అన్నారు. తెలంగాణ యువత తిరగబడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు బయటకి రాలేడని హెచ్చరించారు. తెలంగాణ రైతన్నలు యువతరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరుముతారని అన్నారు. కాంగ్రెస్‌ను తన్ని తరిమితేనే రైతు ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో తిరిగివస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతాంగం అష్టకష్టాలు పడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువని ఆరోపించారు.
ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని మండిపడ్డారు. రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎనిమిది గంటలపాటు ధర్నా చేసినా ప్రభుత్వం మనసు కరగలేదన్నారు. రెండున్నర నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదని విమర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరఫున మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ద్వారా కూడా ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు అందాయని గుర్తుచేశారు.
నలుగురు రైతులు చనిపోయినా రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లైనా లేదని తీవ్ర విమర్శలు చేశారు. షాపుల్లో దొరికే యూరియాను యాప్ ద్వారా మాత్రమే ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఓటేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కాటేస్తోందని మండిపడ్డారు. నాలుగు విడతల రైతుబంధు నిధులను కూడా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. కరువుకు శాశ్వత పరిష్కారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని వినియోగించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.






