భగ్గుమన్న రైతాంగం: శంభూ బార్డర్ వద్ద ఉద్రిక్తత.. హర్యానా సరిహద్దులు క్లోజ్

by Malleboina Mahesh |

భారత్-యూఎస్ ఎఫ్‌టీఏ ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్.. శంభూ బార్డర్ సీల్ చేసిన పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత!

భగ్గుమన్న రైతాంగం: శంభూ బార్డర్ వద్ద ఉద్రిక్తత.. హర్యానా సరిహద్దులు క్లోజ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ - అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (India-US Free Trade Agreement) తీవ్రంగా నిరసిస్తూ పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల రైతులు చేపట్టిన "ఢిల్లీ చలో" మార్చ్ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్‌లోని పాటియాలా వైపు నుండి వేలాదిగా శంభూ బార్డర్‌కు (Shambhu Border) చేరుకున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీలోని 'కిసాన్ ఘాట్' వద్ద నిర్వహించ తలపెట్టిన మహా పంచాయత్‌కు వెళ్లకుండా వంతెనలపై భారీ సీమెంట్ దిమ్మెలు, ముళ్లకంచెలతో కాంక్రీట్ బారికేడ్లు ఏర్పాటు చేసి, వాటర్ కేనన్లతో పోలీసు దళాలను భారీగా మోహరించారు.

అమెరికాతో ప్రతిపాదిస్తున్న ఈ ఒప్పందం వల్ల అక్కడి చవకైన డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి దిగుమతి అయి, దేశీయ పశుపోషకులు, చిన్న తరహా రైతుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపై రైతు నేతలు మండిపడుతుండగా, ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ పోలీసులు సైతం సరిహద్దుల్లో భారీగా భద్రతను పెంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే సీజేపీ నిరసనలతో జంతర్ మంతర్ ఉద్రిక్తంగా మారగా.. వీరికి తోడుగా రైతుల నిరసనలు చేరితో హింసాత్మకంగా మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story