ఆరోజు క్యాంపు కార్యాలయంలో ఏం జరిగింది? అఘాయిత్యమా... ఆత్మహత్యాయత్నమా?

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-21 04:12:09  IST  )

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి మానకోండూర్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం ముందు మంటల్లో తగలబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా

ఆరోజు క్యాంపు కార్యాలయంలో ఏం జరిగింది? అఘాయిత్యమా... ఆత్మహత్యాయత్నమా?
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి మానకోండూర్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం ముందు మంటల్లో తగలబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలకు బీజం పోస్తు అసలు ఆరోజు ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఏం జరిగింది అనే జోరందుకుంది. ముందుగా బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు అంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలు జిల్లాలో కొత్త చర్చకు దారితీస్తూ అసలు రాజేందర్ రెడ్డిది ఆత్మహత్యాయత్నమా? ఒంటరిగా వచ్చాడని చూసి మరేదైనా అఘాయిత్యం జరిగిందా?అనే అనుమానం రేకెత్తుతున్నాయి

అఘాయిత్యామా? ఆత్మహత్యాయత్నమా?

బాధితుడు బేతెల్లి రాజేందర్ రెడ్డి భార్య సమత సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్న అంశాలు కోత్త చర్చకు దారితీస్తున్నాయి అయితే రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికివాడు కాదు అంటు అనుమానాలు వ్యక్తం చేస్తు అలా చేసే వాడు అయితే ఎంఎల్ఏకు ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో మెసేజ్ చేసి క్యాంపు కార్యాలయానికి వస్తున్న మిమ్మల్ని కలవడానికి వస్తున్న అని సందేశం ఎందుకు పంపిస్తారు అంటూ ప్రశ్నించారు. ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయంటున్న బాధితుడి భార్య తమ బాధను పోలీసులకు చెప్పుకునేందుకు ప్రయత్నించినా కనీసం తమ మొర ఆలకించకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని తన భర్తది ఆత్మహత్యాయత్నమా?లేక ఎంఎల్ఏ అనుచరులు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా తేల్చాలని వేడుకుంటు తన భర్త ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోందని ఈ పరిస్థితికి కారకుడైన ఎంఎల్ఏ ప్రయివేటు పీఏ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఆరోజు క్యాంపు కార్యాలయంలో ఏం జరిగింది?

అగ్నికి ఆహుతై గాయపడ్డ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి స్థానిక ఎంఎల్ఏకు తన గోడు వెల్లబోసుకుంటా అని ఫోన్ చేసి ఎత్తకపోవడం తో తన పోన్ నుండి మీ క్యాంపు కార్యాలయానికి వస్తున్నా అంటూ మెసేజ్ పెట్టి వెళ్ళడంతో వస్తున్న సమాచారం తెలుసుకున్న ఎంఎల్ఏ అనుచరులు పథకం ప్రకారం ఏమైనా అఘాయిత్యానికి ఒడికట్టారా? లేక రాజేందర్ రెడ్డినే తనకు తాను ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టారా అంటు చర్చ జరుగుతుండగా కొందరు అఘాయిత్యానికి అవకాశం లేకపోలేదు అనే సందేహాలు వ్యక్తం చేస్తుండటం నియోజకవర్గం కొత్త అనుమానాలకు దారితీస్తుంది. అందుకు అధికారికంగా క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేయకపోవడం బలపరుస్తుండగా బాధితుడు చావు బ్రతుకుల మధ్య కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రదర్శించాల్సిన శాసనసభ్యులు బాధితుడి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడం సదరు బాధితుడిపై ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయడం కూడా అనుమానాలకు ఆజ్యం పోస్తుందనే చర్చ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరందుకుంది.

న్యాయం చేయండి బాధితుడి భార్య..

నా భర్త పై అక్రమ కేసులు పెట్టి వేధించిన మానకోండూర్ ఎంఎల్ఏ పర్సనల్ పీఏ మురళీధర్ రెడ్డి పై చట్టపర చర్యలు తీసుకుని న్యాయం చేయండి అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా విజ్ఞప్తి చేయగా పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్న నెటిజన్లు పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేసు పూర్వపరాలు పరిశీలించి బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్ బాస్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారంటు చేసిన ఆరోపణలపై నెటిజన్లు ఆ నియోజకవర్గంలో చట్టం పనిచేస్తుందా ?అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బాదితుడు ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టాడా లేక ఏదైనా అఘాయిత్యం జరిగిందా అనేది అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story