- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఎందుకు వచ్చాయో వివరించాలి '
కాళేశ్వరం ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ లోపాలు ఎందుకు వచ్చాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి డిమాండ్ చేశారు.

దిశ, సిద్దిపేట అర్బన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ లోపాలు ఎందుకు వచ్చాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రంతో కలిసి ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర ఉనికి చాటుకునేందుకు నిర్వహించిన రాజకీయ కార్యక్రమం అన్నారు.
ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో, కాలువల నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదో హరీశ్ రావు ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న మున్సిపల్, శాసనసభ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించి మంత్రి కూడా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ డిపార్ట్ మెంట్ చైర్మన్ తప్పెట శంకర్, నాయకులు సాకి ఆనంద్, మంద పాండు, పుట్ల యేసు, దేవయ్య, బయ్యారం యాదగిరి, ఐలేని యాదగిరి గౌడ్, శంకర్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






