ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ బోల్తా

by Ratna Kumari |

మండలంలోని గుబ్బగుర్తి గ్రామంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పిన లారీ బోల్తాపడింది.

ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ బోల్తా
X

దిశ, కొణిజర్ల : మండలంలోని గుబ్బగుర్తి గ్రామంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పిన లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ గుబ్బగుర్తి గ్రామ సెంటర్‌లోని మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలే కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Next Story