టాటా ఏఐఏ రూ.4.5 కోట్ల బీమా క్లెయిమ్‌ అందజేత

by Kodari Anjali |

రోడ్డు ప్రమాదంలో మరణించిన కరీంనగర్‌కు చెందిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ బీమా పరిహారం అందజేసింది.

టాటా ఏఐఏ రూ.4.5 కోట్ల బీమా క్లెయిమ్‌ అందజేత
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదంలో మరణించిన కరీంనగర్‌కు చెందిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ బీమా పరిహారం అందజేసింది. శ్రీకాంత్ తల్లి, నామినీ అయిన పొన్నం విజయకు సంస్థ క్లస్టర్ హెడ్ వి. వినోద్, ఇతర ప్రతినిధులు ఈ చెక్కును పంపిణీ చేశారు. కరీంనగర్‌ బ్రాంచ్ క్లస్టర్ హెడ్ వి. వినోద్, మేనేజర్ కే. వీరస్వామి మాట్లాడుతూ.. కరీంనగర్‌కు చెందిన పొన్నం శ్రీకాంత్ నవంబర్ 2024లో ఏటా రూ.70 వేల ప్రీమియంతో టాటా ఏఐఏ సంస్థలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. డిసెంబర్ 2025లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించగా, సంస్థ వేగంగా స్పందించి క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేసి బాధిత కుటుంబానికి చెక్కు అందజేసింది. జీవితంలో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడకుండా ఉండేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణ లభించే ఇలాంటి పాలసీలు ప్రతి కుటుంబానికి అవసరమని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా బీమా రక్షణ కల్పించుకోవాలని సూచించారు.

Next Story