- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔటర్ రింగ్ రోడ్‌పై ఆధునిక హరిత నిర్వహణ
హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై ఆధునికీకరించిన హరిత నిర్వహణ వ్యూహంలో రహదారి భద్రతా ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు ‘ఆటోమేటెడ్ యంత్రాలు’లతోపాటు ఆటోమెటిక్ నీటిని అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు.

- ప్రమాదాల నివారణకు చర్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై ఆధునికీకరించిన హరిత నిర్వహణ వ్యూహంలో రహదారి భద్రతా ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు ‘ఆటోమేటెడ్ యంత్రాలు’లతోపాటు ఆటోమెటిక్ నీటిని అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధాన క్యారేజ్‌వేపై జరిగిన పలు ప్రాణాంతక ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికులు, క్షేత్రస్థాయి సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)’ మానవ శ్రామికులపై ఆధారపడే పద్ధతులు, సంప్రదాయ వాటర్ ట్యాంకర్ల వినియోగాన్ని వేగంగా తగ్గిస్తూ, ఆధునిక యాంత్రిక విధానాలను అమలు చేస్తోంది.
158 కిలోమీటర్లు
హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) 158 కి.మీ. పొడవు గల, 8-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే. హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో దీనిని అభివృద్ధి చేశారు. ప్రధాన జాతీయ రహదారులు, విమానాశ్రయ మార్గాలు, హైదరాబాద్ పరిసర అభివృద్ధి కేంద్రాలను ఓఆర్ఆర్ అనుసంధానిస్తుంది. 2006 నుండి 2018 మధ్య దశలవారీగా సుమారు రూ. 8,821.95 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇరువైపులా 2-లేన్ల సర్వీస్ రోడ్లు ఉన్నాయి. 5 మీటర్ల వెడల్పు గల సెంట్రల్ మీడియన్ ఉంది. 150 మీటర్ల రైట్ ఆఫ్ వేలో గంటకు 120 కి.మీ. డిజైన్ వేగంగా వాహనాలు దూసుకుపోతున్నాయి. వీటితోపాటు 19 ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి.






