ఉద్యోగిని గర్భం దాల్చిందని కంపెనీ దాష్టికం..

by  |
ఉద్యోగిని గర్భం దాల్చిందని కంపెనీ దాష్టికం..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కంపెనీలు ఉద్యోగులను ఎందుకు ఉద్యోగంలో నుండి తొలగిస్తాయి. వారి పని నచ్చకపోయినా లేక వారి హాజరుశాతం తగ్గినా లేక కంపెనీ ఆర్థిక పరిస్థితిలో ఉండి జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను కంపెనీ నుండి తొలగిస్తాయి.. అయితే ఓ కంపెనీ మాత్రం గర్భవతి అయినందుకు ఒక ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది. ఏంటీ.. ఇది మరీ విడ్డురంగా ఉంది. గర్భవతి అయితే ఎక్కడైనా ఉద్యోగం నుండి తీసేస్తారా..? అని అనుకుంటున్నారా..? అవును బ్రిటన్ కి చెందిన యులియా కిమిచెవా అనే మహిళను అలాగే ఉద్యోగం నుండి తీసేశారంట. వివరాలలోకి వెళితే బ్రిటన్‌లోని కెంట్ నగరానికి చెందిన యులియా కిమిచెవా అనే మహిళ ‘కి ప్రమోషన్స్ లిమిటెడ్’ అనే సంస్థలో పనిచేస్తోంది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆమెకు మెయిల్ వచ్చింది. కారణం ఏమి చెప్పకుండా తనని జాబ్ నుంచి ఎలా తీసివేస్తారని ఆమె కోర్టుకెక్కింది.

కంపెనీ తరపున తనకు సమాధానం కావాలని కోర్టు ను కోరింది. అయితే సదురు కంపెనీ ఆమెను ప్రగ్నెంట్ అయినందుకు తాము జాబ్ నుంచి తొలగించలేదని, ఆమె పనితీరు సరిగ్గా లేకపోవడం, అంతేకాకుండా హాజరు శాతం తక్కువ ఉండటం వల్ల ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. తాను గర్భవతిగా ఉండడం వలనే తనకు చాలా సమస్యలు తలెత్తాయని.. పనిపై కూడా ప్రభావం పడిందని మహిళ తెలిపింది. ఇరు వాదనలు విన్న కోర్టు మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కంపెనీ తీర్పును తప్పు పడుతూ సదురు ఉద్యోగి కి రూ.14.5 లక్షలు చెల్లించాలని పేర్కొంది. దీంతో చేసేదేమి లేక ఆ కంపెనీ ఉద్యోగికి కోర్ట్ చెప్పిన మొత్తన్ని చెల్లించింది.

Next Story

Most Viewed