- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు..ముగ్గురు మృతి!
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని దుబ్బగూడ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయారు.

దిశ,వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని దుబ్బగూడ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని టెక్కలికి చెందిన అప్పన్న, రామారావు, తమిళనాడుకు చెందిన మురుగన్ లుగా గుర్తించారు. ఈ ఘటనలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రానైట్ యాజమాన్యం క్వారీలో పిడుగు పడటంతో ముగ్గురు చనిపోయారని ఎలాంట బ్లాస్ట్ జరగలేదని చెబుతోంది.
కానీ మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు క్వారీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బ్లాస్ట్ వల్లనే చనిపోయారని కానీ యాజమాన్యం బుకాయిస్తోందని మండిపడ్డారు. కొండపై నుండి మృతదేహాలను ఎందుకు కిందకు తీసుకువచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను శాంతిపజేశారు. పోస్ట్ మార్టంలో అసలు నిజాలు తెలుస్తాయని అక్కడ నుండి పంపించారు.






