దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా.. రాహుల్ ధర్నాపై ‘ఆప్’ తీవ్ర విమర్శలు

by Kema Shiva Kumar |

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా.. రాహుల్ ధర్నాపై ‘ఆప్’ తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పాలిటిక్స్ హీటెక్కాయి. నీట్ (NEET) పరీక్ష అక్రమాలు, విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ఆందోళన తీవ్ర రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో పరస్పర ఆరోపణలు, సవాళ్లు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ నివాసం ఎదుట విపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన చేతుల సంకెళ్ల ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నా వెనుక అధికార బీజేపీ హస్తం ఉందంటూ ‘ఆప్’ సంచలన ఆరోపణలు చేసింది.

సీజేపీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే కుట్ర

రాహుల్ గాంధీ నిరసనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (MP Sanjay Singh) మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న నిజమైన విద్యార్థి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నాటకానికి తెరతీసిందని ఆయన విమర్శించారు. అత్యంత భద్రత ఉండే ప్రధాని నివాసం వరకు కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎలా రానిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని ఇంటి దగ్గరకు కాంగ్రెస్ నాయకులను సులువుగా అనుమతించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందంటూ, ఇది బీజేపీ - కాంగ్రెస్‌ల ఉమ్మడి వ్యూహమని సంజయ్ సింగ్ ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story