- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేముల వీరేశంకు మంత్రి హోదా
నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, నకిరేకల్ : నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేముల వీరేశం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, నకిరేకల్ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీల్లో ఒకదానితో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వానికి నమ్మకంగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన వేముల వీరేశంకు ఇప్పటికే ప్రభుత్వ విప్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాజాగా మంత్రి హోదా కల్పించారు. దీంతో నకిరేకల్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.






