- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ లో ప్రతి కార్యకర్త పాత్ర కీలకం..
ప్రత్యేక సమగ్ర సవరణ - SIR పై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు జడ్చర్ల పట్టణంలోని ఆర్ఎస్ఎస్ భవనంలో బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

దిశ, జడ్చర్ల: ప్రత్యేక సమగ్ర సవరణ-SIR పై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు జడ్చర్ల పట్టణంలోని ఆర్ఎస్ఎస్ భవనంలో బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. నాయకులు, SIR ద్వారా ఓటరు జాబితాలో వచ్చే మార్పులు, ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో ప్రతి బీజేపీ కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి SIR గురించి ప్రజలకు వివరించాలి. "రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకురావాలి" అని నాయకులు సూచించారు. ఈ అవగాహన సదస్సులో బీజేపీ మండల, పట్టణ నాయకులు, వివిధ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. SIR పై వచ్చిన సందేహాలను నాయకులు అక్కడికక్కడే నివృత్తి చేశారు.






