ఏడు నెలల్లో సైబర్ మోసాల బాధితులకు రూ.25 కోట్లకు పైగా నగదు రీఫండ్

by Kodari Anjali |

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం 2026 జనవరి నుండి జూలై వరకు సైబర్ ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు రూ.25 కోట్లకు పైగా నగదు సైబర్ క్రైమ్ పోలీసులు రీఫండ్ చేశారు.

ఏడు నెలల్లో సైబర్ మోసాల బాధితులకు రూ.25 కోట్లకు పైగా నగదు రీఫండ్
X

దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం 2026 జనవరి నుండి జూలై వరకు సైబర్ ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు రూ.25 కోట్లకు పైగా నగదు సైబర్ క్రైమ్ పోలీసులు రీఫండ్ చేశారు. మోసపూరిత లావాదేవీలను సకాలంలో ఫ్రీజ్ చేయడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేయడం ద్వారా ఇది సాధ్యమైంది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ ను ప్రవేశపెట్టింది. ఈ పౌరస్నేహపూర్వక డిజిటల్ వేదిక ద్వారా ఫ్రీజ్ చేసిన నిధులను అర్హులైన బాధితులకు సులభంగా, పారదర్శకంగా తిరిగి అందించే ప్రక్రియను రూపొందించారు.రీఫండ్ చేయదగిన మొత్తాన్ని గుర్తించిన తర్వాత, బాధితుడికి ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఎం ఆర్ ఎం పోర్టల్ లింక్ ద్వారా నగదు బదిలీ చేశారు. ఎన్ సి ఆర్ పి అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఓటిపితో లాగిన్ అయి, పాన్ కార్డు , అవసరమైతే కోర్టు ఉత్తర్వును అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తు దర్యాప్తు అధికారికి ఆన్‌లైన్ ద్వారా పరిశీలన అనంతరం ఆమోదం లభిస్తే సంబంధిత బ్యాంకు నేరుగా బాధితుడి ఖాతాలో రీఫండ్ మొత్తాన్ని జమ చేస్తుంది.ఈ సాంకేతిక ఆధారిత విధానం ద్వారా సైబర్ మోసాల బాధితులకు రీఫండ్ ప్రక్రియ మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. గత ఒక నెల కాలంలోనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎం ఆర్ ఎం పోర్టల్ ద్వారా సుమారు రూ.2 కోట్ల రీఫండ్ చేశారని సైబర్ క్రైమ్ డిసిపి కె. పుష్ప తెలిపారు.

Next Story