మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి హోదా

by Taduka Kalyani |

ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి హోదా
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిఓ.ఆర్టీ.నెంబర్ 1064 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం స్టేట్ వారెంట్ ప్రిసిడెన్స్ లోని ఆర్టికల్-18 ప్రకారం రాష్ట్ర మంత్రి హోదాకు సంబంధించిన అధికారిక అన్ని ప్రోటోకాల్స్, మర్యాదలు ఆయనకు వర్తిస్తాయి. ప్రభుత్వ విప్ గా శాసనసభలో ప్రభుత్వం తరపున సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించడం, నియోజకవర్గ అభివృద్ధి, విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలు లాంటి అనేక కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి హోదా దక్కడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.

Next Story