- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్లపై ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు
ట్రాక్టర్లకు ఫుల్ వీల్స్ (ఇనుప చక్రాలు) అమర్చి సీసీ రోడ్లపై నడిపితే సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏన్కూర్ ఎస్సై సంధ్య హెచ్చరించారు.

దిశ, ఏన్కూర్ : ట్రాక్టర్లకు ఫుల్ వీల్స్ (ఇనుప చక్రాలు) అమర్చి సీసీ రోడ్లపై నడిపితే సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏన్కూర్ ఎస్సై సంధ్య హెచ్చరించారు. మండల పరిధిలోని టి.ఎల్.పేట గ్రామ ప్రధాన రహదారిపై ట్రాక్టర్‌కు ఫుల్ వీల్స్ అమర్చి నడపడం వల్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి టి.ఎల్.పేట గ్రామానికి చెందిన కె.నరసింహారావుపై ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు సంబంధిత చట్టాల ప్రకారం ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్సై సంధ్య మాట్లాడుతూ.. ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలకు ఇనుప చక్రాలు అమర్చి సీసీ రోడ్లపై నడపడం వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతింటాయని, దీనివల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం నిర్మించిన రహదారులను ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా దెబ్బతీయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలకు ఫుల్ వీల్స్ అమర్చి రహదారులపై నడిపి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంధ్య హెచ్చరించారు.






