రైతులకు గుడ్ న్యూస్.. పంట రోగాన్ని గుర్తించి మందు కొట్టే రోబో వచ్చేసింది

by Ajay Maddhiboyina |

పంటలకు సకాలంలో మందులు కొట్టకపోతే పంట నాశనం అవుతుంది. ముఖ్యంగా తెగులు పట్టినప్పుడు మందులు కొట్టకపోతేే పంట మొత్తానికి అది వ్యాపిస్తుంది.

రైతులకు గుడ్ న్యూస్.. పంట రోగాన్ని గుర్తించి మందు కొట్టే రోబో వచ్చేసింది
X

దిశ‌,వెబ్ డెస్క్: పంటలకు సకాలంలో మందులు కొట్టకపోతే పంట నాశనం అవుతుంది. ముఖ్యంగా తెగులు పట్టినప్పుడు మందులు కొట్టకపోతేే పంట మొత్తానికి అది వ్యాపిస్తుంది.అయితే పంటకు ఏ తెగులు సోకింది అనేది రైతుకు తెలియదు. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి చూసి చెబితే ఆ మందు కొట్టాలి. దీనికి చాలా సమయం పట్టొచ్చు, దాని వల్ల పంట నాశనం అవ్వచ్చు. కానీ ఇప్పుడు అలా వేచి చూసే బాధ లేకుండా రైతుల కోసం మార్కెట్ లోకి రోగాన్ని గుర్తించి అవే మందు కొట్టే రోబోలు వచ్చేశాయి.

ఐఐటీ ఖరగ్‌పూర్ యూనివర్సిటీలో మెకానికల ఇంజనీరింగ్ విభాగం వారు ఈ రోబోను తయారు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటూ వ్యవసాయంలో ఉత్పాదకను పెంచడానికి ఈ రోబోను తయారు చేసినట్టు ప్రొఫెసర్ దిలీప్ కుమార్ తెలిపారు. తన పర్యవేక్షణలో పీహెచ్‌డీ మరియు స్టూడెంట్స్ బృంధం ఈ ప‌రిశోధ‌న జ‌రిపిన‌ట్టు చెప్పారు. అన్ని వ్య‌వ‌సాయ భూముల‌కు అనువుగా ఉండేలా ట్రాక్డ్ మొబైల్ మాన్యుపులేష‌న్ సిస్ట‌మ్ తో దీనిని త‌యారు చేశారు. ఇది మొక్క వ్యాధిని గుర్తించి త‌గిన మందును పిచికారీ చేస్తుంది.

Next Story