- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన రావులపల్లి నరసింహారావుకు ఘన సన్మానం
అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సహచర మీడియా మిత్రుడు రావులపల్లి నరసింహారావును వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

దిశ, అశ్వాపురం : అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సహచర మీడియా మిత్రుడు రావులపల్లి నరసింహారావును ఆదివారం మండల కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన రావులపల్లి నరసింహారావు, జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని మీడియా మిత్రుల సమస్యను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని చెప్పారు. అలాగే జర్నలిస్టుల కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయింపు అంశాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పగడాల రామిరెడ్డి, కె.వి. రెడ్డి, కల్లూరి నరసింహారావు, అండెం గంగరాజు, అప్నా మురళి, రవికుమార్, రామగిరి యాకోబు, జి.ఓం ప్రకాష్, బచ్చలకూరి వెంకట్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.






