- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా చేస్తే దీక్ష విరమిస్తారు : సోనమ్ వాంగ్ చుక్ భార్య
ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షల చుట్టూ రాజకీయ, సామాజిక పరిణామాలు నిమిష నిమిషానికి మారుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ ఆందోళనలు, ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షల చుట్టూ రాజకీయ, సామాజిక పరిణామాలు నిమిష నిమిషానికి మారుతున్నాయి. దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఈ ఉద్యమ సెగలు ఏమాత్రం తగ్గడం లేదు. సోనమ్ ఆసుపత్రిలో కూడా తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్న తరుణంలో, ఆయన భార్య గీతాంజలి అంగ్మో మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలను పంచుకున్నారు. విద్యావ్యవస్థలో జవాబుదారీతనం, పేపర్ లీకేజీల సమస్యలపై రాజకీయ నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆమె కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నేతలు ఎవరైనా ఆసుపత్రికి వచ్చి సోనమ్‌ను పరామర్శించి, ఈ విద్యా వ్యవస్థ సమస్యలను పార్లమెంటులో ఖచ్చితంగా లేవనెత్తుతామని స్పష్టమైన హామీ ఇస్తే సోనమ్ తన దీక్షను విరమిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇది సోనమ్ వాంగ్‌చుక్ కుటుంబం, CJP సంయుక్తంగా తీసుకున్న నిర్ణయమేనని పార్టీ వర్గాలు ధృవీకరించాయి.
విద్యార్థుల భవిష్యత్తు కోసం సోనమ్ ప్రాణాలను పణంగా పెట్టారని, కనీసం పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరుగుతుందనే హామీ లభిస్తే ఆయన ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమింపజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని CJP నేతలు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి ఆయనకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గీతాంజలి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయాయని, వైద్యుల పర్యవేక్షణ అత్యంత అవసరమని పేర్కొంటూ కోర్టు ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ ఉత్కంఠ పరిణామాల మధ్యే నేడు జరగబోయే CJP 'ఛలో సంసద్ యాత్ర' పై అందరి దృష్టి నెలకొంది.






