సిడం శంభు స్పూర్తితో ఉద్యమాలు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

by Batti.Sumithra |

ఆదివాసి ఉద్యమ నాయకులు, తుడుందెబ్బ వ్యవస్థాపకుడు సిడం శంభు స్పూర్తితో నేటితరం ఆదివాసీ నాయకులు ఉద్యమాలు చెయ్యాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

సిడం శంభు స్పూర్తితో ఉద్యమాలు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
X

దిశ, ఉట్నూర్ : ఆదివాసి ఉద్యమ నాయకులు, తుడుందెబ్బ వ్యవస్థాపకుడు సిడం శంభు స్పూర్తితో నేటితరం ఆదివాసీ నాయకులు ఉద్యమాలు చెయ్యాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివాసి ఉద్యమ వీరుడు సిడం శంభు 8వ వర్ధంతిని ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ సమాజం మంచి ఉద్యమకారున్ని కోల్పోవడం చాలా బాధాకరమని, చూస్తూ ఉండగానే ఆయన మరణించి 8 సంవత్సరాలు గడిచిపోయాయన్నారు.

తక్కువ వయసులోనే ఆయన మరణించడం ఆదివాసీ సమాజానకి తీరని లోటని, నేటి ఆదివాసీ యువత ఆయన స్పూర్తితో ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాలు చెయ్యాలని, ఆ మహానుభావుడి విగ్రహ ఏర్పాటుకు అనేకసార్లు ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ వారి కుటుంబ సహకరంతోనే అది సాధ్యమన్నారు. ఎలాంటి భేష భావాలు లేకుండా శంభు కుటుంబంలో పెళ్ళైన అందరికీ మా ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, మంచి ఇళ్లు కట్టుకొని, శంభు ఆశీర్వాదంతో సమాజంలో గొప్పగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. అదే విధంగా సిడం శంభు వర్ధంతి సందర్భంగా ఆదివాసి సంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story