- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం.. కుటుంబం దుర్మరణం
ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా దంపతులు మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా దంపతులు మృతి చెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కల్లేర్ మండలం బాచుపల్లి సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున.. సదరు ఫ్యామిలీ నాందేడ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన స్కార్పియో వెహికల్.. అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కుటుంబం మరణించగా.. మృతుల్లో నాలుగేళ్ల పాప కూడా ఉన్నట్లు గుర్తించారు. మృతులను షామీన్ బేగం (50), ఆమె కుమారుడు నదీమ్ (30), మనవరాలు అనాబియా (4) మృతి చెందారు. వాహనంలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హజ్ యాత్రకు వెళ్లి.. తిరిగి వస్తున్న కుటుంబసభ్యులను తీసుకువచ్చేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను నారాయణ్ ఖేడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






