మీర్‌పేట్ రౌడీ షీటర్‌ హత్యకేసు.. ఇన్‌స్టా లైవ్‌లో పోలీసులకే సవాల్ విసిరిన నిందితుడు

by Ajay Maddhiboyina |

మీర్ పేట్‌లో నందనవనంకు చెందిన రౌడీషీటర్ సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో మాజీ రౌడీ షీటర్ సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ సూరిని పథకం ప్రకారం హతమార్చాడు.\

మీర్‌పేట్ రౌడీ షీటర్‌ హత్యకేసు.. ఇన్‌స్టా లైవ్‌లో పోలీసులకే సవాల్ విసిరిన నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్: మీర్ పేట్‌లో నందనవనంకు చెందిన రౌడీషీటర్ సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో మాజీ రౌడీ షీటర్ సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ సూరిని పథకం ప్రకారం హతమార్చాడు. గతంలో సూరి అఫ్రోజ్ భార్యతో పాటు సల్మాన్ బావమరిది హత్యకేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల అతడిని పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. సూరిని ఎలాగైనా చంపేయాలని కక్ష పెంచుకున్న అఫ్రోజ్ అతడితో స్నేహం చేస్తున్నట్టు నటించాడు.

ఈ క్రమంలో సూరి తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల కోసం నందనవనానికి రావడంతో ప్లాన్ ప్రకారం అతడిపై పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన సూరిని ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు అప్పటికే మరణించినట్టు చెప్పారు. సూరిపై హైదరాబాద్ తో పాటు వరంగల్, మల్కాజ్ గిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక హత్యచేసిన అనంతరం అఫ్రోజ్ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూరిని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు తనను పట్టుకోలేరు అంటూ దుర్భాషలాడాడు.

Next Story