గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Taduka Kalyani |

గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి జూలై 27న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు వెల్లడించాయి.

గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, దమ్మాయిగూడ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలోని రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలలోని గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న పరిమిత ఖాళీ సీట్లను స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు హైదరాబాద్, రంగారెడ్డి రీజినల్ కో ఆర్డినేటర్ తెలిపారు. 5వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు అన్ని కేటగిరీల అభ్యర్థులకు, 6వ నుండి 9వ తరగతి వరకు గిరిజన (ఎస్.టి.) విద్యార్థులకు మాత్రమే స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించబడుతయాన్నారు. ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి 27-07-2026 (సోమవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల (బాలుర్), జిన్నారం, సంగారెడ్డి జిల్లా నందు నిర్వహించబడే స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కు హాజరుకావలెనని తెలిపారు. బోనా ఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒక సెట్ జిరాక్స్ ప్రతులు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. మరిన్ని వివరాలకు: రంగారెడ్డి : 9490233477, వికారాబాద్: 9441731298, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి: 9440829022, సంగారెడ్డి : 9849237238 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Next Story